గౌరవేల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ వేగవంతం చేయాలి. *నియోజకవర్గంలో అభివృధి పనులకు భూ కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలి  *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.  *హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ అంశాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై అధికారులతో నిర్వహించిన వేరు వేరు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 

సిద్దిపేట/హుస్నాబాద్, జూన్ 10 (జాగో న్యూస్): హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ అంశాలు, భూసేకరణ పురోగతి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం మరియు విద్యార్థుల సంఖ్య పెంపుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండల, డివిజనల్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్ట్ పరిధిలోని మూడు జిల్లాల్లో భూసేకరణకు అవసరమైన నిధులు ఇప్పటికే విడుదలయ్యాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపుల పురోగతిపై అధికారులను ఆరా తీసిన మంత్రి, టీటీడీ దేవస్థానం, ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్, మహిళా బజార్ ఏర్పాటు కోసం అవసరమైన భూముల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే చౌటపల్లి పారిశ్రామిక కారిడార్‌కు సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల సంఖ్య పెంపుపై నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈఓలు, మూడు జిల్లాల డీఈఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రతి గ్రామంలో విస్తృతంగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పెయింటింగ్ పనులు, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలాల వారీగా ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత మేర పెంచాలనే లక్ష్యాలను నిర్దేశించుకుని కార్యాచరణ రూపొందించాలని సూచించారు.. విద్యార్థులు పాఠశాలలకు ఆకర్షితులయ్యే విధంగా పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో లు, డీఈవో లు,ఎమ్మార్వో లు , ఎంఈవో లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

వివో బిల్డింగ్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.. *ఉపాధి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలి.. *నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించండి..*జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

గౌరవేల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ వేగవంతం చేయాలి. *నియోజకవర్గంలో అభివృధి పనులకు భూ కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలి  *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.  *హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ అంశాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై అధికారులతో నిర్వహించిన వేరు వేరు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్