ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి.. *దొగ్గలి శ్రీధర్ డిమాండ్ 

కరీంనగర్, జూన్ 16 (జాగో న్యూస్): ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ తల్లిదండ్రులను పిప్పి పిలుస్తున్నారు ప్రభుత్వం వెంటనే ఫీజులు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ఏఏ పాఠశాలకు ఎంత ఫీజులు ఏ కళాశాలలకు ఎంత ఫీజులు అని ప్రభుత్వం నియంత్రణ చేయాల్సి ఉంది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల కళాశాల దోపిడీని అరికట్టాలి ప్రభుత్వం లక్షలాది రూపాయలు తల్లిదండ్రుల నుండి దోచుకున్న దీనిని పట్టించుకోవడం లేదు జిల్లా స్థాయిలో పర్యవేక్షించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలతో కుమ్ముకవుతున్నారు ఎన్ని ఫిర్యాదు చేసిన దానిపై చర్యలు లేవు విచారణ లేదు యదేచ్చగా దోపిడీ చేయడానికి వారికి లైసెన్స్ ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.G.O. MS NO 91 తేదీ 6-08-2009 ప్రకారం ప్రైవేటుపాఠశాలలు కనీసం మూడు దుకాణాల వివరాలను ప్రకటించాలి. పుస్తకాలు నోట్బుక్స్ స్టేషనరీని స్కూల్ కౌంటర్లో విక్రయించిన అది No profit No loss ప్రతిపాదకన మాత్రమే ఉండాలి. తల్లిదండ్రులు నిర్దిష్ట దుకాణం లేదా స్కూల్ నుంచి కొనుగోలు చేయాలని బలవంతం చేయరాదు. నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు బుక్కులు డ్రెస్సులు అమ్మిన విద్యాశాఖ అధికారి తెలిసిన ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించాలని లేని పక్షాన విద్యాశాఖ అధికారుల తీర్పు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు , నిరాహార దీక్షలు నిర్వహిస్తా మనీ బీసీ సంక్షేమ సంఘం నాయకులు దొగ్గలి శ్రీధర్ యువజన సంఘం నాయకులు మాదాసు సంజీవ్ తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

వివో బిల్డింగ్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.. *ఉపాధి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలి.. *నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించండి..*జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

గౌరవేల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ వేగవంతం చేయాలి. *నియోజకవర్గంలో అభివృధి పనులకు భూ కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలి  *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.  *హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ అంశాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై అధికారులతో నిర్వహించిన వేరు వేరు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్