కరీంనగర్‌లో జూన్ 18న ఉచిత స్వర్ణ ప్రాశన శిబిరం: *పిల్లల రోగనిరోధక శక్తి పెంపునకు సువర్ణావకాశం *ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రభాకర్ (ఎండి, గోల్డ్ మెడలిస్ట్)

కరీంనగర్, జూన్ 16 (జాగో న్యూస్): కరీంనగర్ నగరంలోని భగత్ నగర్, కలెక్టరేట్ రోడ్డులో గల “శ్రీ సంహిత ఆయుర్వేదం” ( హెచ్ డీ ఫ్ సి బ్యాంక్ పక్కన) సౌజన్యంతో జూన్ 18, 2026 (గురువారం) పుష్యమి నక్షత్రం రోజున “స్వర్ణ ప్రాశన శిబిరం” ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ప్రభాకర్ ఎండి పర్యవేక్షణలో ఈ స్వర్ణప్రాశన చుక్కలను పుట్టిన మొదటి నెల నుండి 16 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలందరికీ అందించనున్నారు. కేవలం రూ. 100/- మాత్రమే రుసుముతో పిల్లలకు విలువైన స్వర్ణప్రాశన చుక్కలను వెయనున్నారు. ముఖ్యంగా స్వర్ణప్రాశన వల్లపిల్లలలో మేధస్సు, జ్ఞాపకశక్తి మరియు గ్రహించే శక్తిని మెరుగు పరిచి, శారీరక బలాన్ని, సత్తువను ,రోగ నిరోధక శక్తిని పెంపొందించి, పిల్లల సమగ్ర ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగేశరీర కణజాలాలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.శరీరానికి వెచ్చదనం, జీర్ణక్రియ ఆకలిని ప్రోత్సహిస్తుంది. ప్రధానంగా

తరచుగా జలుబు, దగ్గు బారిన పడే పిల్లలకు, జీర్ణక్రియ సమస్యలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి, ఆకలి మందగించి సరిగ్గా ఆహారం తినని వారికి, జ్ఞాపకశక్తి ,మానసిక-శారీరక ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలకు ఈ స్వర్ణప్రాశన అమృతంలా పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా Whatsapp ద్వారా తమ పేర్లను నమోదు చేయించుకోవడం తప్పనిసరి సూచించారు. . కేవలం పేరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్లు
9951554577, 9182672079, 9948996253లలో సంప్రదించవచ్చని తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

వివో బిల్డింగ్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.. *ఉపాధి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలి.. *నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించండి..*జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

గౌరవేల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ వేగవంతం చేయాలి. *నియోజకవర్గంలో అభివృధి పనులకు భూ కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలి  *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.  *హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ అంశాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై అధికారులతో నిర్వహించిన వేరు వేరు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్