54వ డివిజన్‌లో ఘనంగా ‘బడిబాట’ కార్యక్రమం.. పాల్గొన్న కార్పొరేటర్ జి.ఉమారాణి

కరీంనగర్ జూన్ 16 (జాగో న్యూస్): కరీంనగర్ నగరంలోని 54వ డివిజన్ పరిధిలో గల అంగన్‌వాడీ స్కూల్‌లో మంగళవారం ‘బడిబాట’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ బడులలో చేరికలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ జి.ఉమారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో మేలు చేస్తాయని, ఇక్కడ అందించే పౌష్టికాహారం, ప్రాథమిక విద్య పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. అర్హులైన పిల్లలందరినీ తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ వరలక్ష్మి, ఆయా, మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బడిబాటలో భాగంగా చిన్నారులకు అంగన్‌వాడీ సిబ్బంది సాదరంగా స్వాగతం పలికారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

వివో బిల్డింగ్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.. *ఉపాధి కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలి.. *నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించండి..*జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

గౌరవేల్లి ప్రాజెక్ట్ కాలువల భూసేకరణ వేగవంతం చేయాలి. *నియోజకవర్గంలో అభివృధి పనులకు భూ కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలి  *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.  *హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, రెవెన్యూ అంశాలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై అధికారులతో నిర్వహించిన వేరు వేరు సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్