రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, జూన్ 27 (జాగో న్యూస్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారి స్నేహ తెలిపారు. మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పల్స్ పోలియో చుక్కలు వేస్తారు. అప్పుడే పుట్టిన పసికందుల నుండి 5 ఏళ్ల చిన్నారుల వరకు పల్స్ పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. అనంతరం సోమవారం నుండి ఇంటింటికి వైద్య సిబ్బంది వచ్చి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని అన్నారు.









