ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు *సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్ది

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, జూన్ 27 (జాగో న్యూస్): ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తాడురు గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ…ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన వస్తుందని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలను అందిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం  చర్యలు చేపడుతోందనీ వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు సంక్షేమం, మహిళల సాధికారత, విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.   ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్ది తో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షులు టోనీ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు