అంగరంగ వైభవంగా శ్రీ పోచమ్మ అమ్మవారి బోనాల మహోత్సవం

రాజన్న సిరిసిల్ల/చందుర్తి, జులై 8 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం సనుగుల గ్రామంలో నిర్వహించిన శ్రీ పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్‌రావు సతీమణి డాక్టర్  చెన్నమనేని దీప హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీ పోచమ్మ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రెడ్డబోయిన గోపిని, డాక్టర్  చెన్నమనేని దీపని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు అల్లాడి రమేష్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ మండల అధ్యక్షులు మోకిలే విజయేందర్ రామారావు పల్లె గ్రామ సర్పంచ్ నరుగుల వాణి గంగ స్వామిలు బిజెపి సీనియర్ నాయకులు సురేష్ వంతడుపుల సుధాకర్ గణేష్ దేవయ్య మల్లేశం లక్ష్మీరాజం చిర్రం తిరుపతి మేకల జలంధర్ రేగుల శ్రీకాంత్ హనుమయ్య చారి చింతకుంట సాగర్ రమేష్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు మహిళలు యువకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు