రాజన్న సిరిసిల్ల/తంగానపెల్లి, జూలై 08 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో BLA-2ల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా SIR కన్వీనర్‌గా గరిపెల్లి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా Special Intensive Revision (SIR) కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో BLA-2ల బాధ్యతలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రతి ఓటరును చేరుకోవాల్సిన విధానం, అవసరమైన పత్రాల సేకరణ, సమయపాలనతో పనులు పూర్తి చేయడం వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయడానికి ప్రతి BLA-2 సమన్వయంతో పనిచేయాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు, శక్తికేంద్ర ఇంచార్జీలు, బూత్ అధ్యక్షులు, BLA-2లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.








