గుంతలు పూడ్చి వేత

కరీంనగర్/రామడుగు, జూలై 23 (జాగో న్యూస్): గత కష్ట కాలం రోజులు మళ్ళీ రానే వచ్చాయి. కురుస్తున్న వర్షాలకు ఎప్పటి లాగే రామడుగు వాగుపై గల పాత బ్రిడ్జి పై గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలపై ప్రతి రోజూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ ఇబ్బందులు వాట్సప్ గ్రూపుల్లో చెక్కర్లు కొట్టిస్తున్నారు.వారి ఇబ్బందులు కొంత వరకైనా తాత్కాలికంగా తొలగించే ప్రయత్నాలు స్థానిక పోలీసులు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు చేపట్టారు.ఇందులో భాగంగా పలు వాహనాల ద్వారా రోడ్డుపై మొరం పోసి గుంతలు పూడ్చి వేశారు.బ్రిడ్జి కి బారి గండ్లు పడి రవాణా నే ఇబ్బందిగా మారినప్పుడల్లా పోలీసులే ముందు నిలుస్తున్నారని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్