కరాటేలో పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మాజీమంత్రి గంగుల

కరీంనగర్, మార్చ్ 04 (జాగో న్యూస్): మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో ఈనెల రెండవ తేదీన శ్రీపదరావు మెమోరియల్ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని ఎస్.ఆర్. ప్రైమ్ పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినీ విద్యార్థులు వివిధ మెడల్స్ సాధించారు. ఈ నేపథ్యంలో వారు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారు సాధించిన పథకాలను విద్యార్థులకు అందజేసి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. కరాటే లోని పలు విభాగాల్లో ఈ పథకాలను వారు సాధించారు. సన్నిధి గోల్డ్ మెడల్,అన్యదక్ష రెడ్డి గోల్డ్ మెడల్,ఆర్యాహి సిల్వర్ మెడల్, ధనిక్షా సిల్వర్ మెడల్, మనస్విని సిల్వర్ మెడల్,ఉషశ్రీ బ్రాంజ్ మెడల్, రిషికేష్ బ్రాంజ్ మెడల్ లు సాధించారు. ఈ కార్యక్రమంలో కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ సురభి వేణుగోపాల్, ఎస్సార్ ప్రైమ్ జోనల్ ఇంచార్జ్ శశిధర్, పాఠశాల ప్రిన్సిపల్ రాజి రెడ్డి, పాఠశాల ఇంచార్జ్ వరుణ్ రావు,పిఈటి వంశీ, తదితరులు ఉన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్