అట్టహాసంగా ప్రారంభమైన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి..పార్టీ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. మండల అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ ఆద్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో రాష్ట్ర ,జిల్లా,మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రామంలోని వాడవాడలో తిరుగుతూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని ప్రజలకు నేతలు వివరించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత బీజేపి పాలనలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పరిపాలన చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందనీ ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్