తాగునీటి కోసం తల్లడిల్లుతున్న మహబూబ్ కాలనీవాసులు

కరీంనగర్, ఏప్రిల్ 07 (జాగో న్యూస్): కరీంనగర్ పట్టణంలోని పెద్దపెల్లి బైపాస్ సమీపంలో గల మహబూబ్ కాలనీ రోడ్ నెంబర్ 1,కాలనీవాసులు తాగు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. బొమ్మకల్ గ్రామపంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ కాలనీలో గత ఎనిమిది నెలల క్రితం నల్ల కనెక్షన్ ఇచ్చి నల్ల నీరు వదలకపోవడంతో నీళ్లకు ఈ కాలనీవాసులు నిత్యం తిప్పలు పడే పరిస్థితి దాపురించింది. ఈ విషయమై పలుమార్లు గ్రామపంచాయతీ దృష్టికి తీసుకువెళ్లిన ఎవరూ పట్టించుకోవడం లేదని, కాలనీలో నీళ్లు లేకపోవడంతో వాటర్ ట్యాంకుల ద్వారా డబ్బులు చెల్లించుకొని నీళ్లు తెప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. నల్లలు రాకపోవడంతో తాగేందుకు మంచినీరు సైతం కరువైందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసేవి కాలంలో నల్ల నీళ్లు రాకపోవడంతో తాము చేసేదేం లేక నీళ్లను కొనుగోలు చేసుకునే పరిస్థితి దాపురించిందని, ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు దృష్టిసారించి తమకు నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్