తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్

హైదరాబాద్, మే 12 (జాగో న్యూస్): యోగాలో డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నట్లు భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్ తెలిపారు. ఈ మేరకు సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని చెప్పారు. పతంజలి యోగ సమితి భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రమంతా.. నిత్యం యోగా తరగతులు నిర్వహిస్తూ వేలాదిమందికి ఉచితంగా శిక్షణ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్య,కార్పొరేట్ సంస్థల్లో పెరుగుతున్న యోగ టీచర్ల అవసరాన్ని దృష్టిలోపెట్టుకుని ప్రామాణిక పద్ధతిలో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించాలనే సంకల్పంతో పలు యోగ కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. అసిస్టెంట్ యోగ టీచర్ కేటగిరిలో యువతకు వంద గంటలపాటు శిక్షణ ఇచ్చి తదుపరి ప్రాక్టికల్ పరీక్ష, రాత పరీక్షలు నిర్వహిoచి పతంజలి యోగ పీట్ నుండి సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందన్నారు. యోగ టీచర్ గా స్థిరపడి యోగసేవ కూడా చేసే వారికి ముఖ్య యోగ శిక్షకుల శిక్షణను పతంజలి యోగ పీట్ హరిద్వార్ పర్యవేక్షణలో అందిస్తామని, ఇలా శిక్షణ పొందిన వ్యక్తులు రోజు రెండుగంటలు ఉచిత యోగసేవలు సమాజానికి అందించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. వైసీబి కోర్సులను లెవెల్ 1 నుండి 4 వరకు శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహిoచి ఆయుష్ డిపార్ట్మెంట్, యోగ సర్టిఫికేషన్ బోర్డు ద్వారా సర్టిఫికెట్ అందిస్తామని వివరించారు. ఇప్పటివరకు 22 బ్యాచులకు శిక్షణ ఇచ్చామని కృపాకర్ అన్నారు. పై రెండు కోర్సులు చేసిన వందలాదిమంది పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, పీఎం శ్రీ స్కూళ్ళు, సీబీఎస్ఈ స్కూళ్ళు,ఆయుష్ విభాగం ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగ అవకాశాలు పొందినట్లు కృపాకర్ తెలిపారు. అయితే ఈ నియామకాలకు సంబంధించి ఏదైన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, డిప్లొమా, పీజీడిప్లొమా అడుగుతున్నారని, అందులో భాగంగానే సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని చెప్పారు. గతంలో ఈ కోర్సులను వివిధ రాష్ట్రాలకు వెళ్లి చేయాల్సి వచ్చేదని, ఇకనుండి ఇక్కడే వాటిని పూర్తి చేయవచ్చని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్