సంక్షేమానికి సర్కారు పెద్దపీట  *ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

కరీంనగర్/మానకొండూర్, మే 12 (జాగో న్యూస్): బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన శంకరపట్నం మండల కేంద్రంలోని రైతు వేదిక లో మండలానికి సంబంధించిన 73 మందికి కళ్యాణ లక్ష్మి,51 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి రస ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అందుకే ఆ దిశగా కృషి సాగిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 25 పర్యాయాలు  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిందని ఆయన చెప్పారు. 25వ విడతలో శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 51 మందికి 13,48,000 రూపాయల విలువ చేసే చెక్కులను ఇప్పుడు పంపిణీ చేసినట్టు ఆయన వివరించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ సురేఖ, ఇంచార్జ్ ఎంపీడీవో ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, డిసిసి కార్యదర్శి గట్టు తిరుపతి, మండల సర్పంచ్ ఫోరం చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం చైర్మన్ గొట్టే మధు, సర్పంచులు చింతిరెడ్డి పద్మ, రాజేంద్రప్రసాద్, వినోద్, దుర్గం సుజాత – తిరుపతి, పార్టీ నాయకులు మొలంగూరు సదానందం, ఏ రమేష్, ఖాజా, మధుకర్, జనగాం రాజయ్య,ఆడెపు అజయ్, షారుక్,పవన్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు