కరీంనగర్/తిమ్మాపూర్, మే 12 (జాగో న్యూస్): తెలంగాణ ఉద్యమకారుడు మానకొండూరు నియోజకవర్గం ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు ఎడ్ల జోగి రెడ్డి అంతిమయాత్రలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి పార్తివ దేహం పైన టఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జెండా కప్పి స్మరించుకోవడం జరిగింది ఎడ్ల జోగి రెడ్డి అమర్‌రహే అనే నినాదాలతో మార్మోగింది. సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నే కాకుండా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమం వైపు మళ్ళించినటువంటి ఘనశీలి ఎట్లా జోగి రెడ్డి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాంత ఉద్యమకారులకు జోగి రెడ్డి లేని లోటు తీర్చడం కష్టమైనప్పటికీ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలపడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి జీడి అనిల్ వరంగల్ జిల్లా అధ్యక్షులు చిలువేరు రమేష్ మండల అధ్యక్షులు భూమ సదానందం జిల్లా నాయకులు కనకం విద్యాసాగర్ మానకొండూరు మండల అధ్యక్షులు గోశెట్టి సంజీవ్ శ్రీధర్ మహిళా నాయకురాలు డేనియల్ శారద, మున్నక్క, కూనమల్ల మల్లేశం పల్లి వెంకటేశం తదితరులు ఉన్నారు.








