హైదరాబాద్, మే 05 (జాగో న్యూస్): హైదరాబాదులో మంగళవారం రోజున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన జరిగిన కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎస్ పి వి బోర్డు సమావేశంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. మొట్ట మొదటి సారిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డాక్టర్ టి . కె శ్రీదేవి ని కలిసి పూలమొక్క అందజేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… స్మార్ట్ సిటీ నిధుల కింద ₹70 కోట్లతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను బోర్డు ఆమోదించిందన్నారు. ఈ నిధులతో నగరంలో మల్టీపర్పస్ పార్కింగ్ వ్యవస్థ మరియు పలు ప్రాంతాల్లో వరద కాలువ సమస్యల నివారణకు చేపట్టే పనులను ప్రతిపాదించామని పేర్కొన్నారు. అలాగే అర్బన్ చాలెంజ్ ఫండ్ యు సి ఎఫ్ కేంద్ర ప్రభుత్వ స్కీం ద్వారా చేపట్టే వివిధ అభివృద్ధి పనులు, విధివిధానాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. సమావేశంలో జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్, సీపీ, ఇంజినీర్-ఇన్-చీఫ్, డిటిపిసి కార్పొరేషన్ ఇంజినీర్లు పాల్గొన్నారు.








