కరీంనగర్, మే 04 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు మే 5న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను అధికారులంతా కలిసి సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు తెలిపారు. ఈనెల 5న మంగళవారం జరగనున్న మెగా జాబ్ మేళా నిర్వహణపై సోమవారం రాత్రి కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఏర్పాట్లు వసతుల కల్పన నియామక ప్రక్రియ ప్రశాంతంగా చేపట్టేలా తగిన ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 5న మెగా జాబ్ మేళాను కలెక్టరేట్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. డీఈఈట్, టాస్క్ , ఉపాధి కల్పన కార్యాలయ సమన్వయంతో సుమారు 100 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటాయని తెలిపారు. దాదాపు మెగా జాబ్ మేళాకు 5000 మంది వరకు నిరుద్యోగ యువత హాజరవుతారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. పక్కా ప్రణాళికతో జాబ్ మేళాను నిర్వహించాలని సూచించారు. నిరుద్యోగ యువతకు అన్ని ఏర్పాట్లు వసతులు కల్పించాలని పేర్కొన్నారు. అవగాహన కల్పించేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులు సమన్వయంతో జాగ్రత్తగా అన్ని చూసుకోవాలని తెలిపారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని లోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. జాబ్ మేళా లో పాల్గొనే అభ్యర్థులు ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ కాంప్లెక్స్ లో రిపోర్ట్ చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆర్డిఓ కే మహేశ్వర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, జెడ్పి సిఈఓ శ్రీనివాస్ డిపిఓ జగదీశ్వర్ మెప్మా పీడీ స్వరూప రాణి, జిల్లా టాస్క్ మేనేజర్ గంగ ప్రసాద్ తహసిల్దారులు లక్ష్మీ నరసింహారావు నరేందర్ తోపాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.








