కరీంనగర్/తిమ్మాపూర్, మే 06 (జాగో న్యూస్): పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన బాలసాధనం విద్యార్థినులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా బుధవారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు. తిమ్మాపూర్ కేజీబీవీ చదువుతున్న కే. సాధన 536 మార్కులు సాధించింది. స్కూల్లో ఫస్ట్ ర్యాంకు అదేవిధంగా ఇదే స్కూల్లో చదువుతున్న ఎం హారిని 516 మార్కులు సాధించింది. ఆరేపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్న కే హారినీ 298 మార్కులు సాధించింది. ఈ ముగ్గురు విద్యార్థినుల ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అభినందించారు. ఉన్నత చదువులు చదివి మంచి మార్కులు సాధించాలని విద్యార్థినిలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి యం. సరస్వతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డిసిపిఓ) దుర్ధాన పర్వీన్, శాంత, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు.








