కరీంనగర్, మే 02 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన వి ఆంజనేయ రావు ని శనివారం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్ రాజు , బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ తో కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానం చేయడం జరిగింది.. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులుగా ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించే సమయంలో విద్యార్థులకు క్రమశిక్షణ మంచి ఫలితాలు సాధించే దిశగా పనిచేసిన అధికారిగా గుర్తింపు పొందినారు ఇలాంటి అధికారికి ఇంటర్మీడియట్ విద్యాధికారిగా ప్రభుత్వం నియమించడం శుభకరం అని తెలిపారు..2026-2027 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో ఎంసెట్ బోధన నిర్వహించాలని వారిని కోరారని తెలిపారు. దానికి విద్యాధికారి వి. ఆంజనేయ రావు గారు సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వానికి లేక పంపించి ఎంసెట్ బోధన అమలు అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.








