గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం *అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి *గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులు, ఎన్ పీడీసీ ఎల్ అధికారుల వద్ద వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి *డివిజన్, మండల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ 

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 10 (జాగో న్యూస్): గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్, సెస్, మత్స్య, పోలీస్, రవాణా శాఖ, ఆర్ అండ్ బీ, నీటి పారుదల, వైద్య ఆరోగ్య శాఖ, తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఆద్వర్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కావాల్సిన క్రేన్స్, జేసీబీలు, విద్యుత్ దీపాలు, నీటి సదుపాయం కల్పించాలని ఆయా కమిషనర్లు ఆదేశించారు. స్టీల్ గ్లాస్ లతో నీటిని ఇవ్వాలని తెలిపారు మండపాల వారీగా మున్సిపల్ సిబ్బందిని నియమించి పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు. ప్రతి మండపం వద్ద డస్ట్ బిన్ ఏర్పాటు చేయించాలని తెలిపారు. ఎన్ పీ డీ సీ ఎల్ అధికారులు వినాయక మండపాలు, నిమజ్జనం రోజున విగ్రహాలు వెళ్లే దారిలో విద్యుత్ తీగలు ఎత్తు పెంచి ఇబ్బంది కలగకుండా చూడాలని,  సమస్యల పరిష్కారానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. మండపాల నిర్వాహకులు ఎన్ పీ డీ సీ ఎల్ అధికారుల వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో, అలాగే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో జాలర్లను నియమించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 24*7 అంబులెన్స్ లు, మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో పెట్టాలని, సిరిసిల్ల జీజీహెచ్, వేములవాడ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది, ఎమర్జెన్సీ కేర్ అందుబాటులో ఉండాలని సూచించారు. పోలీసులు, అగ్ని మాపక శాఖలు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లా రవాణా శాఖ అధికారులు నిమజ్జనం సాఫీగా సాగేలా కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాలు వెళ్లే రోడ్లకు ఆర్ అండ్ బీ అధికారులు మరమ్మత్తు చేయించాలని, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో, ఆయా గ్రామ పంచాయతీల్లో నిమజ్జనం చేసే చోట పారిశుధ్య పనులు చేయించాలని, గడ్డి, ఇతర చెత్తాచెదారం తొలగింపచేయాలని ఆదేశించారు. నీటి వనరుల వద్ద బారికేడింగ్, లైటింగ్, కావలసిన క్రేన్లు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిమజ్జనం ముగిసిన తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు అన్ని వార్డులు, గ్రామ పంచాయతీ లలో పారిశుధ్య పనులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడ డివిజన్, ఆయా మండలాల పరిధిలో ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని, నవరాత్రి ఉత్సవాల నుంచి నిమజ్జనం వరకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

*నీరు, ఇసుక నిలువ ఉండాలి

జిల్లాలోని అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తమ వివరాలను పోలీస్ శాఖ వెబ్ సైట్ లో నమోదు చేయాలని ఎస్పీ మహేష్ బి గితె సూచించారు. నిమజ్జనం రోజున నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలని కోరారు. ప్రతి మండపం వద్ద ప్లాస్టిక్ డ్రమ్లలో నీరు, ఇసుక నిలువ ఉంచాలని సూచించారు. పోలీస్ శాఖ వారి https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్సైట్ లో వివరాలు నమోదు చేయాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే ఎస్ బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రాచారి, శ్రీనివాసులు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి హిమశ్రీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, ఎన్ పీ డీ సీ ఎల్, జిల్లా పంచాయతీ శాఖ, మత్స్య శాఖ అధికారులు, తహసీల్దార్లు మహేష్, జయంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ గూడూరి రమేష్ 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ *తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ *పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె

గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం *అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి *గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులు, ఎన్ పీడీసీ ఎల్ అధికారుల వద్ద వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి *డివిజన్, మండల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్