రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 10 (జాగో న్యూస్): పంచాయతీరాజ్ శాఖ, టీజీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో హెల్త్ సబ్ సెంటర్స్ తుది దశ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎన్ హెచ్ ఎం, 15 ఆర్థిక సంఘం నిధులు ఇతర నిధులతో పంచాయతీరాజ్ శాఖ,టీజీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో జిల్లాలో హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనుల పై జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో ఆయా శాఖల జిల్లా అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ హెచ్ ఎం కింద 9 సబ్ సెంటర్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, 15వ ఆర్థిక సంఘం కింద నిధులతో చేపట్టిన ఒక సబ్ సెంటర్ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, పై నిధులతో చేపట్టిన ఆరు భవనాల పనులు తుది దశలో ఉన్నాయని అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. తుది దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా భవనాల్లో నీటి, విద్యుత్, టాయిలెట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేయాలని, ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ఆయా శాఖల జిల్లా అధికారులు సమీక్షించాలని, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ ఈఈ సుదర్శన్ రెడ్డి, టీజీఎంఎస్ ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ గూడూరి రమేష్







