కరీంనగర్, మే 12 (జాగో న్యూస్): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివైఎఫ్ఐ, ఐద్వా జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ చౌక్ వద్ద బండి భగీరథని అరెస్టు చేసి రిమాండ్ చేయాలని ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజినీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్* మాట్లాడుతూ వెంటనే బండి భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ గాని ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా బండి సంజయ్ తనయుడికి కొమ్ము కాస్తూ ప్రభుత్వ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్టు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అధికార బలంతో తమ కొడుకు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నారు, అధికార అహంకారంతో మహిళల భద్రతను బండి సంజయ్ తాకట్టు పెడతారా అని వారు ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైన బీజేపీ నాయకత్వం స్పందించడం లేదు రాష్ట్రంలో ఎక్కడైనా అల్లర్లు సృష్టించడం, మతోన్మాదం పేరుతో గొడవలు చేయడం మాత్రమే బిజెపి నైజామా? దేశంలో చట్టాన్ని భద్రతను కాపాడాల్సిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఇంట్లోనే చట్టాన్ని ఉల్లంఘించడం సమాజానికి ఏం సందేశాన్నిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడిపై పోక్సో లాంటి తీవ్రమైన కేసు నమోదు అవుతుంటే ఏ నైతిక విలువలతో తన కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ పదవిలో ఉండి ప్రజలు సిగ్గుపడే పని చేసిన తన కొడుకుని సమర్ధించుకొస్తున్న బండి సంజయ్ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి . ప్రత్యక్షంగా మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేసిన గాని రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకుండా పోలీస్ యంత్రాంగం బండి సంజయ్ కి కోమ్ముకాస్తూ అన్యాయానికి గురి అయిన అమ్మాయికి ఏ మాత్రం కూడా న్యాయం చేయకుండా పోలీసులు ,ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని వారు ప్రభుత్వం పైన మండి పడ్డారు. ఇప్పటికైనా భగీరథ్ ను అరెస్టు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు . అన్యాయానికి గురైన మైనర్ బాలిక కుటుంబానికి భద్రత కల్పించాలి బండి భగీరథ్ గతంలో మహేంద్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ చేయడం మరియు డ్రగ్స్ తీసుకోవడం చెడు అలవాట్లతో తన తండ్రి అండతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం గతంలో సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టిన పరిస్థితి నెలకొంది అని వారు అన్నారు .మరియు ఆమె యొక్క కుటుంబానికి బెదిరింపులు బండి సంజయ్ అనుచరుల నుండి వస్తున్నాయి కావున ఆమెకి రక్షణ కల్పించాలి,సమగ్ర విచారణ జరిపించాలి.యెడల డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్ జిల్లా సహాయ కార్యదర్శులు దుర్గం బోగేష్,గట్టు ఆకాష్ జిల్లా కమిటీ సభ్యులు రత్నం సురేష్,రాకేష్,సందేశ్,నాయకులు సన్నీ, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్ రాజ్ కుమార్, సహాయ కార్యదర్శులు అశోక్,అరవింద్ నాయకులు విజయ్,చందు,సిన,నితిన్ కుమార్,నాయకులు ఐద్వా నాయకురాలు చెనీ రోజా, ఉప్పునూటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








