కరీంనగర్/తిమ్మాపూర్, మే 12 (జాగో న్యూస్): కేంద్రమంత్రి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర కార్యక్రమానికి తిమ్మాపూర్ మండల బిజెపి శ్రేణులు తరలి వెళ్లారు. మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు,కార్యకర్తలు మహాత్మానగర్లోని శ్రీ తపాలా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ ప్రాంగణ వేదిక నుంచి కరీంనగర్ లోని వైశ్య భవన్ కు వాహనాలతో ర్యాలీగా హిందూ ఏక్తా యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ప్రతి ఏటా హిందూ ఏక్తాయాత్రను నిర్వహిస్తున్నారని తెలిపారు. హిందువుల ను సంఘటితం చేయడమే లక్ష్యంగా గత 16 సంవత్సరాలుగా హిందూ ఏక్తా యాత్ర కరీంనగర్లో ఘనంగా ఓ గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంగా కొనసాగుతుందన్నారు.








