శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు 

కరీంనగర్/తిమ్మాపూర్, మే 12 (జాగో న్యూస్): కరీంనగర్ నగరపాలక సంస్థ 8వ డివిజన్ అలుగునూర్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు తిరునగరి వెంకటాద్రి స్వామి, హర్షవర్ధన్ స్వామి ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. హనుమాన్ జన్మ దినోత్సవము సందర్భంగా ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చిందం నరసయ్య , గడప శేఖర్ , సిరిపురం శ్రీనివాస్ , సల్ల మల్లేశం , బూట్లకరుణాకర్, రాజేంద్రప్రసాద్ , రాజిరెడ్డి , సుధాకర్ రెడ్డి, మృత్యుంజయం , కొట్టాల శ్రీనివాస్ , చిందం అంజి , చిందం మహేష్ లతోపాటు కాలనీ ప్రజలు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

తెలుగు విశ్వవిద్యాలయంలో డిగ్రీ, డిప్లొమా యోగా కోర్సులు *ఒప్పందం కుదుర్చుకున్న భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ *విద్య, కార్పొరేట్ సంస్థల్లో యోగ టీచర్లకు డిమాండ్ *భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంఘటన కార్యదర్శి నందనం కృపాకర్