కరీంనగర్, మే 12 (జాగో న్యూస్): కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మరియు NSUI నేషనల్ కోఆర్డినేటర్ మన్నే జీవన్ సూచనలతో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల సుమంత్ ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు చేసిన విషయంలో బండి బగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా చౌక్ వద్ద నిన్న రాత్రి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యు. ఐ నాయకులు మాట్లాడుతూ **బేటీ బచావో _ బేటీ పడవో** అన్న నినాదం రాజకీయాలకే పరిమితం చేసి, పేద మధ్య తరగతి మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయింది అని తెలిపారు. మైనర్ బాలికపై జరిగిన ఘటనలో బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకొని, బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని మరియు బండి సంజయ్ తన మంత్రి పదవి నుండి రాజీనామా చేయాలి అని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా NSUI నాయకులు మాట్లాడుతూ, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం మరియు పోలీసులు ఎలాంటి ఒత్తిడులకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. బాధిత మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు ఎన్‌ఎస్‌యూఐ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేపట్టిన సమయంలో పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగగా, అనంతరం పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే నిందితులను కాపాడే ప్రయత్నాలు మానుకుని, చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని ప్రభుత్వం నిరూపిస్తుంది అన్ని తెలియజయడం జరిగింది. ఈ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల సుమంత్, జిల్లా NSUI నాయకులు పల్లె వెంకటరమణ రెడ్డి, బసవనేని తేజస్, పెద్దపల్లి గోపాలకృష్ణ , ఉమ్మేతల ఆశిష్ రెడ్డి, ఇతర NSUI నాయకులు, గొట్టే బాబు, గజా అజయ్, సందీప్,పాల్గొన్నారు.








