ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలి  *బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి

రాజన్న సిరిసిల్ల/వేములవాడ/భీమారం, సెప్టెంబర్ 10 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని భీమారం మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు నాగం శివకుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు  రెడ్డబోయిన గోపి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీకి కార్యకర్తలే ప్రధాన బలం అని, ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పనిచేసే ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని రెడ్డబోయిన గోపి భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఏ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినా, దాని పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. పార్టీ సంస్థాగతంగా ప్రతి బూత్‌ను బలోపేతం చేయాలని, మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహించాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు, సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందే విధంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిని పార్టీ నాయకులు, కార్యకర్తలు చిరు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ దశరథం రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు కరేడ్ల మధుకర్, సిరికొండ శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు అన్నాడి జలపతి రెడ్డి, మేడిపల్లి మండల అధ్యక్షులు చిట్యాల సురేష్, కథలాపూర్ మండల అధ్యక్షులు మల్యాల మారుతి, బీజేపీ సీనియర్ నాయకులు జగన్ రెడ్డి, మండల పదాధికారులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ *తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ *పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె

గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం *అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి *గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులు, ఎన్ పీడీసీ ఎల్ అధికారుల వద్ద వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి *డివిజన్, మండల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్