మనోధైర్యంతో ముందుకు సాగాలి *మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడేవారు టోల్ ఫ్రీ నెంబర్ 14416,  వైద్య సేవలు పొందాలి *ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ 

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 10 (జాగో న్యూస్): మానసిక ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారు మనోధైర్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ‘ఆత్మహత్యల నివారణ దినం’ సందర్బంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ‘టోల్ ఫ్రీ నెంబర్ 14416’ పోస్టర్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఎంహెచ్ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్ తో కలిసి గురువారం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించి ఆత్మ హత్యల నివారణ గురించి అవగాహన కల్పించాలని, యువత, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకునే కంటే వీటిని దాచి పెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తారని, ఈ  సమస్యపై మాట్లాడేందుకు చాలా మంది ఇష్టపడరని వివరించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మానసిక కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, చికిత్స పూర్తిగా ఉచితముగా అందిస్తామని, వారియొక్క వివరాలు గోప్యముగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకోవడంలో టెలీమానాస్ (టోల్ ఫ్రీ నెంబర్ 14416) 24X7 సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సేవలను ప్రజలు వియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్యుల  సూచన మేరకు సూచించిన మోతాదులో మందులు వాడితే ఆత్మహత్యలు నివారించ బడుతాయని అన్నారు, సమాజం, చుట్టూ ప్రక్కల వారు ఆత్మ న్యూనత భావనతో ఉన్న వారికి చేయూత ఇవ్వాలని, అవగాహనతో మెలగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నయీమా జహా, వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ గూడూరి రమేష్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ *తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ *పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె

గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం *అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి *గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులు, ఎన్ పీడీసీ ఎల్ అధికారుల వద్ద వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి *డివిజన్, మండల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్