బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష

కరీంనగర్, సెప్టెంబర్ 10 (జాగో న్యూస్): దేశవ్యాప్తంగా జరిగే జాతి జనగణలో బీసీ కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో 1-5- 2025 న నిర్ణయం తీసుకొని ప్రకటించింది. కానీ ఇప్పుడు కులగణన శాస్త్రీయమైన పద్ధతిలో చేయకుండా, ఓబీసీ కుటుంబాలను లెక్కించకుండా, బీసీ కాలం లేకుండా, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ లేకుండా బిసీలకు అన్యాయం చేస్తుంది, రెండవసారి ఇప్పుడు జాతీయ జన గణన ఆగస్టు 17వ తేదీ నుండి ప్రారంభం మొదలుపెట్టింది. బీసీలను మోసం చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని,నయవంచను వ్యతిరేకిస్తూ రేపు ఉదయం 10:00 గంటలకు11 వ తేదీన (శుక్రవారం) రోజున కరీంనగర్ జిల్లా, కలెక్టరేట్ ముందు బీసీల ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం పిలుపునిస్తోంది. కావున ఈ ధర్మ పోరాట దీక్షను విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి బీసీల న్యాయమైన డిమాండ్ ను వినిపించాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమాలను ఆపేది లేదని ప్రతి బీసీ బిడ్డ ఈ ధర్మ పోరాట దీక్షకు పెద్ద ఎత్తున తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ పిలుపునిచ్చారు.

సీనియర్ జర్నలిస్ట్ గూడూరి రమేష్

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ *తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ *పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె

గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం *అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి *గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులు, ఎన్ పీడీసీ ఎల్ అధికారుల వద్ద వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి *డివిజన్, మండల స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్