కోతిరాంపూర్ సెక్టార్ లో అమ్మా మాట అంగన్వాడీ బాట కార్యక్రమం

కరీంనగర్, మే 30 (జాగో న్యూస్): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్ కోతిరాంపూర్ సెక్టార్ లో అమ్మా మాట అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించడ జరిగినది. ఈ కార్యక్రమంలో DWO సరస్వతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో నూతన విద్య సంవత్సరా నికి పిల్లల నమోదు మరియు స్వాగత కార్యక్రమం శనివారం నిర్వహించుకుంటున్నాం అని అన్నారు. ఈ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమం లో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రం లో ప్రీ స్కూల్ పిల్లలకి ప్రభుత్వం అందించే యూనిఫామ్స్ పంపిణీ చేయడం, అంగన్వాడి పరిధిలోని మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసుగల అర్హులైన పిల్లలందరినీ గుర్తించి కొత్తగా కేంద్రంలో నమోదు చేయడం. విద్యారంభ సర్టిఫికెట్లు పంపిణి అంగన్వాడీ కేంద్రాలలో ఐదు నుండి ఆరు సంవత్సరాల పిల్లలు ప్రాథమిక విద్య పూర్తి చేసినట్లు ఒకటవ తరగతి ప్రవేశానికి స్కూల్ రెడీనెస్ కి ఉపయోగపడతాయి. ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. అంగన్వాడీ కేంద్రాల శుభ్రతలో భాగంగా పిల్లలు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవడానికి కేంద్రం లోపల బయట పరిసరాలను పూర్తిగా శుభ్రపరచాలి అని అన్నారు.43 వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి మొండయ్య మాట్లాడుతూ అంగన్వాడీ లో ఉండే పిల్లలు చాలా చురుకుగా ఉన్నారు అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని అన్నారు. మహిళలు తమ ఆరోగ్య పట్ల శ్రద్ద చూపాలి మహిళలు ఆరోగ్యాంగా ఉంటే నే కుటుంబం ఆరోగ్యాంగా ఉంటుంది అని తద్వారా ఆరోగ్య సమాజం నిర్మించ బడుతుందని అన్నారు. PHC లాలో మహిళలు హెల్త్ check ups చె్యువకోవాలి రక్తహీనత లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం చివరలో యూనిఫామ్ మరియు విద్యారంభ సెరిఫికెట్స్ పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో DWO సరస్వతి cdpo సబిత, 43 డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి మొండయ్య, icds supervisor S.అరుణ DPA రోమిలా, సతీష్, అంగన్వాడీ టీచర్స్ మహిళలు పెద్ద సంఖ్య లో హాజరు అయినారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు