పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

కరీంనగర్, మార్చ్ 18 (జాగో న్యూస్): కరీంనగర్ లోని రాంనగర్ సప్తగిరి కాలనీలో ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అధికారులు సిబ్బందితో మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా వసతులు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు ఇతర మౌలిక వసతులు సౌకర్యాలు ఉండేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం లో జరుగుతున్నాయని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత