ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు “తొలిమెట్టు” బలంగా ఉండాలి *ఆటపాటలతోనే అత్యుత్తమ బోధన.. *అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

కరీంనగర్, మార్చ్ 18 (జాగో న్యూస్): పిల్లల భవిష్యత్తుకు ప్రీ-ప్రైమరీ దశ ఎంతో కీలకమని, ఆ దశలోనే బలమైన పునాది వేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. ఆటపాటల ద్వారా చిన్నారులకు ఆసక్తికరంగా విద్యను బోధిస్తూ, వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం కరీంనగర్‌లోని మల్కాపూర్ ప్రీ-ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ, వారి ఆటపాటలను ఆసక్తిగా గమనించారు. పిల్లలతో కలిసి నవ్వుతూ, వారిని ప్రోత్సహించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న బొమ్మలు, ఆట వస్తువుల గురించి వివరాలు తెలుసుకుని, చిన్నారులకు ఇలాంటి సౌకర్యాలు మరింత పెంచాలని సూచించారు. ఆటపాటలతో చదువు నేర్పడం వల్ల పిల్లల్లో ఆసక్తి పెరిగి, సులభంగా అర్థమవుతుందని తెలిపారు. అనంతరం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్, విద్యార్థులతో మాట్లాడి వారి చదువు స్థాయిని పరిశీలించారు. బోధన విధానంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్