మినిమం బ్యాలెన్స్‌ లేదని రూ.19 వేల కోట్లు వసూలు

పార్లమెంట్ వేదికగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఈ విధానాన్ని ఆయన నిశ్శబ్ద దోపిడీగా అభివర్ణించారు. గత మూడు సంవత్సరాల్లో బ్యాంకులు కనీస నిల్వ లేదనే కారణంతో ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ధనికుల నుంచి కాకుండా సామాన్య ప్రజల నుంచి వసూలు చేయబడిందని అన్నారు.

*పేదలపై భారం*

ఈ పెనాల్టీలు రోజువారీ కూలీలు, రైతులు, పెన్షనర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాఘవ్ చద్ధా ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర అవసరాల కోసం ఖాతాలోని డబ్బు తీసుకున్న తర్వాత కూడా బ్యాంకులు పెనాల్టీలు విధించడం అన్యాయమని ప్రశ్నించారు.

*ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల వసూళ్లు*

ప్రైవేట్ బ్యాంకులు సుమారు రూ.11 వేల కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8 వేల కోట్లు ఈ విధంగా వసూలు చేశాయని ఆయన వెల్లడించారు.ఈ పెనాల్టీలను పేదలపై విధించిన పన్నుగా ఆయన అభివర్ణించారు.

*పెనాల్టీల రద్దు డిమాండ్*

జన్ ధన్ ఖాతాలకు మినహాయింపు ఉన్నప్పటికీ సాధారణ సేవింగ్స్ ఖాతాదారులపై భారీ భారం పడుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్‌బీఐని రాఘవ్ చద్ధా డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 

రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రథమ లక్ష్యం.. *రోల్ మోడల్ గా కరీంనగర్ నిలుస్తుంది.. *అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక కృషి.. *ప్రతి ఒక్కరు సహకరించాలి.. *జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా