కరీంనగర్, మే 30 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా కొత్త రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా జే స్వామి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న జే స్వామికి ప్రభుత్వం ఇటీవల పదోన్నతి కల్పించింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా డీఆర్వోగా నియమితులైన ఆయన శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సమన్వయంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నూతన డీఆర్వోను కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు కలిసి అభినందించారు. ఏవోతో పాటు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌కు చెందిన పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








