రాజన్న సిరిసిల్ల/సిరిసిల్ల, జూన్ 01 (జాగో న్యూస్): సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని కొనసాగుతున్న వీవోఏ మహిళల నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింకర్ రాజన్న ఆధ్వర్యంలో దీక్షా శిబిరాన్ని సందర్శించిన నాయకులు, వీవోఏల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య మాట్లాడుతూ, వీవోఏల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించి జీతాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పడిగల రాజు మానస, వ్యవసాయ కమిటీ చైర్మన్బండి దేవదాస్, తంగళ్ళపల్లి ఉప సర్పంచ్ ఆసాని శ్రీకాంత్ రెడ్డి, బండి జగన్, తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.








