పదవి విరమణ పొందిన రెవెన్యూ డివిజన్ అధికారి కె. మహేశ్వర్ ను సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం

కరీంనగర్, జూన్ 02 (జాగో న్యూస్): గత 30 సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ శాఖలో కీలక బాధ్యత స్వీకరించి అందరి మన్నలను పొందినారు పదవి విరమణ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, జిల్లా కార్యదర్శి వాయిల రాజకుమార్ లు కలసి సన్మానం చేయడం జరిగింది.కరీంనగర్ లో మొదట లెక్చరర్ గా తరువాత ఎమ్మార్వో గా పని చేసే సమయంలో చాలామంది పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇందిరమ్మ ఇళ్లకు స్థలాలు కేటాయింపు రేషన్ కార్డులు ప్రభుత్వ భూములను కాపాడడంలో కీలక పాత్ర వహించినారు. ఉద్యోగరీత్యా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది చేయలేదు. పేదవాళ్లందరికి కూడా సహాయం చేసే మహోన్నత వ్యక్తి, కొత్తపల్లి రైల్వే జంక్షన్ కు సంబంధించి భూ సేకరణ చేసేదానిలో కీలకపాత్ర వహించి కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చే విషయంలో ముందుండి త్వరగా వారికి నష్టపరిహారం ఇప్పించారు.  ఇలా చాలామందికి అనేక రకాలుగా సేవలు చేయడం లో తనదైన శైలిలో ప్రతిభను చాటుకున్న మహోన్నత వ్యక్తి మా గురువర్యులు అని వారు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు