సైనిక్ స్కూల్ రుక్మాపూర్‌లో 2024 జూలై 23న “ఇంటింట ఇన్నోవేషన్ అవగాహన సదస్సు”

కరీంనగర్, జూలై 23 (జాగో న్యూస్): ఇంటింటా ఇనోవేటర్ 6వ ఎడిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని శ్రీరామ్ శ్రీనివాస్ ఇ. మేనేజర్ మరియు డిస్ట్రిక్ట్ కో – ఆర్డినేటర్ మణిదీప్ గారు విజ్ఞప్తి చేశారు. “ఇంటింట ఇన్నోవేటర్-2024” కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలు సమాజానికి, వ్యక్తిగత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని, వాటిని ఉపయోగించుకోవడం ద్వారా యువత ముందుకు వెళ్లగలరని వివరించారు. సైనిక్ స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఆవిష్కరణలపై అవగాహన పెంపొందించడంలో సహాయపడ్డారు. విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఖాకీ యూనిఫారంలో పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా తమ ఆలోచనల్ని, సృజనాత్మకతను వికసించడానికి కావాల్సిన ప్రేరణ పొందారు. మొత్తం కార్యక్రమం చాలా స్ఫూర్తిదాయకంగా, విజ్ఞానపరంగా సాగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్