కెసిఆర్ కి పట్టిన గతే రేవంత్ రెడ్డి కి పడుతుంది… * ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డికిఎక్కడిది..? * బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొంరయ్య లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి… * మీడియా సమావేశంలో బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ వ్యాఖ్యలు..

కరీంనగర్, ఫిబ్రవరి 15 (జాగో న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధాని మోదీ సామాజికవర్గం గురించి మాట్లాడే స్థాయి లేదని, రేవంత్ రెడ్డికి మతి తప్పిందని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని, అధికారంలో ఉన్నామని విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినోళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం రోజున కరీంనగర్ లోని శుభ మంగళ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫస్ట్రేషన్ లో అవాకులు, చావకులుపేలుతున్నాడన్నారు. కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారని , అందుకే ప్రజల దృష్టిలో మరల్చడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా..? మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ఓ బోగస్ ప్రక్రియ అన్నారు. హిందూ ముస్లిం , బీసీ ముస్లిం అని ప్రపంచంలో ఎక్కడైనా ఉందా..? ఈ సర్వే దేశానికి రోల్ మోడలా..? రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే లెక్కలు బోగస్ అని తేలడంతోనే మళ్లీ సర్వే కు అవకాశం ఇచ్చారన్నారు. కుల గణనపై కాంగ్రెస్ ప్రభుత్వానిక చిత్తశుద్ధి లేదన్నారు .ఉంటే.. తెలంగాణలో రెండోసారి కులగనన ఎందుకు..? ముందు దీనికి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బీసీల పట్ల మీరు చేస్తున్న ద్రోహానికి ప్రస్తుతం బీసీలు కూడా కాంగ్రెస్ వైపు లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలనే కసి ప్రజల్లో ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని , లేకపోతే మొన్న కెసిఆర్ నిన్న కేజ్రీవాల్ కు పట్టిన గతే నీకు పడుతుందనీ ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు గాడిద గుడ్డు ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి రావడంలేదని , రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుంటే , ప్రజలను మోసం చేసి పబ్బం గడుపు కోవాలనే కాంగ్రెస్ కు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు , టీచర్స్ తగిన బుద్ధి చెప్పాలన్నారు. బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొంరయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇట్టి సమావేశంలో బిజెపి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ , జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి , మాజీ మేయర్ లు డి శంకర్, సునీల్ రావు , జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి *వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలి *భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి