తంగళ్ళపల్లి మండల కేంద్రంలో త్రాగునీటి ఎద్దడి

రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి మార్చి 04 (జాగో న్యూస్): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రత్యామ్నాయంగా నీటిని ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. లక్షలు వెచ్చించి వేయించిన బోరు బావులు పనిచేయడం లేదు. కొన్నిచోట్ల పనిచేస్తున్న వాటికి కరెంటు సప్లై లేదు. ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు మంచినీటితో ఎన్ని పనులు ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయినా గత రెండు రోజుల నుండి గ్రామంలో మంచినీటి సరఫరా లేకపోవడంతో బావులు, బోరు బావులు అందుబాటులో లేనివారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కనీసం బాత్రూం కు వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి, లక్షలు వెచ్చించి నాయకులు బోరుబావులను వేశారు. వాటికి సంబంధించిన బిల్లులను తీసుకున్నారు. జనాలకు ఉపయోగం లేని బోరుబావులు యేసుడెందుకు.? అభివృద్ధి పేరు మీద ప్రజల డబ్బు వృధా ఖర్చు చేయడం ఎందుకు అంటూ ప్రజలు మండి పడుతున్నారు .ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిత్యం గ్రామపంచాయతీ నుండి నీటి సరఫరా చేయాలని లేని పక్షంలో గ్రామంలో ఉన్న బోరు బావులను ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే గ్రామస్తులు కలిసి గ్రామపంచాయతీ ఎదుట నీటి కోసం నిరసనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మండల కేంద్రంలో ఇలాంటి పరిస్థితులే ఉంటే మరి గ్రామాల పరిస్థితి ఏంటి..? ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే గ్రామంలో నీటి సరఫరా అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి *వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలి *భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి