శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యులను అభినందించిన మాజీమంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్.

 

కరీంనగర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): కరీంనగర్ నగరంలోని కమాన్ వద్ద గల శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా నియామకమైన సందర్భంగా ధర్మకర్తల మండలి బాధ్యులు నేడు కరీంనగర్ ఎమ్మెల్యే గంగులను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం ఈనెల ఆరవ తేదీన నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ధర్మకర్తల మండలిని ఎమ్మెల్యే గంగుల అభినందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముత్తోజు రామ్ కుమార్, ధర్మకర్తలు వెంగళం రామకృష్ణ, ఏదులాపురం మహేష్, గోగులకొండ నరసింహ చారి, వంగల నవీన్, గోగులకొండ కరుణాకర్ వెగ్గలం రామకృష్ణ, గోకుల కొండ నరసింహ చారి తదితరులున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి *వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలి *భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్

భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి… రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి* *భూ భారతి విజయవంతమైన అమలుకు భూ రీ-సర్వేనే కీలకం* *మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయాలి* *రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ. 60 చెల్లింపు* *సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి* *ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీని వేగవంతం చేయాలి* *ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందించాలి* *భూ రీ-సర్వే, ఇందిరమ్మ ఇండ్లు, సాదా బైనామా దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర మంత్రి పొంగులేటి