కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 01 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం పర్లపల్లి ఉప మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో11న తలపెట్టిన హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని సమ్మేళన సమితి అధ్యక్షులు బోనాల మోహన్, ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. 11న జరిగే కార్యక్రమం కోసం హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ నిర్వహణ సమితి బాధ్యులు బుధవారం రోజున ప్రముఖులను కలిసి ఆహ్వానించారు. ఆ దిశలో మొగిలిపాలెం గ్రామ వాస్తవ్యులు డాక్టర్ సముద్రాల శ్రీనివాస్ ను ఆర్థోపెడిక్ సర్జన్ (సిద్దిపేట)ను హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు బోనాల మోహన్ ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షులు ఎర్రోజు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.









