ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక *ప్రత్యేక గ్రామ సభలు.

కరీంనగర్/సైదాపూర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో సమస్త సర్పంచ్ లు,ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారి.ఈ సమావేశ సభల్లో ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతం (జయ జయహే తెలంగాణ) ఆలాపన, సర్పంచ్ స్వాగతం ఉపన్యాసం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం చదివి వినిపించారు. వివిధ శాఖల ద్వారా పథకాలు సాధించిన విజయాలపై ప్రజలకు సమాచారం అందించారు. లబ్ధిదారుల అభిప్రాయాలు తెలిపారు. గ్రామ సమస్యలు పరిష్కారాలపై చర్చ, తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణం,గృహ జ్యోతి, సన్నరకం వారికి బోనస్, చేయూత పెన్షన్లు,కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్,ఇందీరా మహిళా శక్తి – స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ,వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ,కొత్త రేషన్ కార్డులు పలు పథకాల గురించి ఇట్టి సమావేశంలో తెలిపారు.ఇక్కడ మండల ప్రత్యేక అధికారి డి పి ఓ జగదీశ్వర్,మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, ఎంపిడిఓ యాదగిరి, తహశీల్దార్ శ్రీనివాస్,ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు,వార్డు సభ్యులు,ఎన్జీఓ, పంచాయితీ కార్యదర్శులు,గ్రామస్థాయి అధికారులు, గ్రామస్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్