ఘనంగా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి.

కరీంనగర్/సైదాపూర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్):  బహుజన వీరుడు,వీరత్వ వారసత్వం లేని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316 వ వర్ధంతి మండలంలోని సర్వాయి పేట మహమ్మదాపూర్ గ్రామాల మధ్య ఉన్న కొమ్ము గుట్ట వద్ద తెలంగాణ గౌడ కమ్యూనిటీ వెల్ఫేర్ రాష్ట అధ్యక్షుడు మార్క అనిల్ గౌడ్, స్థానిక సర్పంచ్ పోలు స్వరూప ప్రవీణ్,గౌడ సీనియర్ నాయకులు పెద్ది వెంకట నారాయణ,పొన్నం అనూప్,హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ కొమురయ్య,మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్, గౌడ సంఘాల నాయకులు,ప్రతినిధులు, బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి వేడుకలు జరిపి నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు.పలువురు నాయకులు,గ్రామస్థులు,గౌడ సంఘాల నాయకులు,జే ఏ సి నాయకులు,మహిళలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు నివాళులు అర్పించారు. మార్క అనిల్ గౌడ్ మాట్లాడుతూ… జనగాం జిల్లా రఘునాదపల్లి మండలం ఖిలాశపూర్ గ్రామంలో 1650 ఆగస్టు 18న నాసగోని సర్వమ్మ ధర్మన్న గౌడ్ దంపతులకు పుట్టిన బిడ్డ అని,కుల వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే క్రమంలో ప్రజలను పీడిస్తున్న మొగల్ పెత్తందారుల ఆగడాలను అరికట్టడానికి, మిత్రులు చాకలి సర్వన్న,మంగలి మాసన్న,కుమ్మరి గోవిందు,జక్కుల పెర్మాండ్లు,దూదేకులు పీరు,కొత్వాలు పీరు సాహెబు పన్నెండు మంది మిత్రులతో మొఘల్ పాలకుల మీద తిరుగుబాటు చేసి బహుజనుల కోసం పోరాడి మొఘల్ రాజులను జయించి గోల్కొండ కోటను ఏలిన మొదటి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని,1710l ఏప్రిల్ 2 వీర మరణం పొందారని,ఆయన ఆశయాలను కొనసాగించాలని,బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్వాయి పాపన్న ప్రపంచానికి తెలిసేలా సర్వాయి పేట కొమ్ము గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దడానికి నిధులు మంజూరు చేసి,పనులు కూడా ప్రారంభమైన సందర్భంగా మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు.సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం బోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉపసర్పంచ్ బాల్ రెడ్డి,జంపన్న,మాచెర్ల రమేశ్ గౌడ్, ఇల్లందుల లక్ష్మణ్, గట్టు రాములు,జే ఏ సి నాయకులు, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, ఎలుకతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి,గౌడ సంఘాల నాయకులు,పలు మండలాల గౌడ సంఘాల నాయకులు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్