16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాపై నిషేధం విధించాలి *కేంద్రానికి వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య విజ్ఞప్తి

ఢిల్లీ, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): దేశవ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వేదికలపై నిషేధం విధించాలని వరంగల్ లోక్‌సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియా ప్రభావంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికల దుర్వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్నదని ఎంపీ డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచార వ్యాప్తి, ఆన్‌లైన్‌లో పెరుగుతున్న విషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో విభేదాలను పెంచే పరిస్థితులు వంటి అంశాలను ఎంపీ ప్రస్తావించారు. నియంత్రణలు లేకుండా కొనసాగుతున్న డిజిటల్ వేదికలు ప్రజాభిప్రాయాన్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు నెలకొంటున్నాయని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అభిప్రాయపడ్డారు. అవసరమైతే 16 ఏళ్ల లోపు వయస్సు గల వారికి సోషల్ మీడియా వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.. *ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసుకోవాలి *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ *సిరిసిల్లలో 710 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలి  *నియోజకవర్గంలో ప్రతిపాదనలు పంపిన పలు ఆర్అండ్ బి రోడ్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్