మహనీయుల విగ్రహాలను సగర్వంగా ఆవిష్కరించుకుందాం…! *తిమ్మాపూర్ జేఏసి నేతలతో ఎమ్మెల్యే కవ్వంపల్లి.

కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 10 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ముందు గత 4 ఏళ్ళ క్రితం నెలకొల్పిన బాబు జగ్జీవన్ రాం, డా.అంబేద్కర్ విగ్రహాల ముసుగులు తొలగించి ఆవిష్కరించేందుకు ప్రభుత్వ పరమైన అనుమతులు వచ్చాయని, త్వరితగతిన మిగతా పనులు పూర్తి చేసి సగర్వంగా, ఘనంగా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుందామని మానకొండూర్ ఎమ్మెల్యే, పిసిసి ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తిమ్మాపూర్ మండల రాజకీయ, ప్రజాసంఘాల జేఏసి నేతలతో పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో ఆవిష్కరణకు నోచుకోకుండా ముసుగులతో ఉన్న మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు అనుమతులు లభించినందుకు తిమ్మాపూర్ మండల రాజకీయ,  ప్రజాసంఘాల జేఏసి పక్షాన శుక్రవారం ఏమ్మెల్యే ను క్యాంప్ కార్యాలయంలో కలిసి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల సుందరీకరణ,ఆవిష్కరణ కార్యక్రమాలకు ప్రభుత్వం ద్వారా సుమారు 50 లక్షల నిధులను మంజూరు చేయించి అట్టి స్థలాన్ని సుందరంగా నిర్మింకుందామని ఎమ్మెల్యే పేర్కొన్నట్లు జేఏసి సభ్యులు తెలిపారు.విగ్రహాల ఆవిష్కరణ అనుమతుల విషయం లో ఆర్టిసి ఎండి నాగిరెడ్డి తో మాట్లాడగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 14 న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గారి జయంతి వరకు సుందరీకరణ పనులు పూర్తి కావు కాబట్టి కొంత సమయం తీసుకొని పూర్తి స్థాయిలో పనులు చేసి మంత్రులను, ముఖ్య నాయకులను, గతంలో కృషి చేసిన వారిని పిలిపించుకొని పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించుకుందామని ఎమ్మెల్యే పేర్కొనట్లు జెఏసి సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు మాతంగి శంకర్, సుగుర్తి జగదీశ్వరాచారి, వంతడ్పుల సంపత్, దుండ్ర రాజయ్య, సముద్రాల లక్ష్మణ్,కనకం రాములు,మాజీ సర్పంచ్ లు బోయిని కొమురయ్య,మేడి అంజయ్య,మీసాల అంజయ్య,కవ్వంపల్లి పద్మ, మాతంగి లక్ష్మణ్,పోన్నాల సంపత్,నాయకులు కన్నం లక్ష్మన్, అలువాల కోటి,సంగుపట్ల మల్లేశం,ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అలువాల సంపత్,కొయ్యడ మురళి,రెడ్డిగాని రాజు,మామిడి అనిల్,మేకల సతీష్,కన్నం నర్సయ్య, సాగర్, లింగం కుమార్,దావ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత