రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. *ఆయన ఆశయాలను కొనసాగించాలి. *బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ 

కరీంనగర్, ఏప్రిల్ 14 (జాగో న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా  బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ , బీసీ యువజన సంఘం అధ్యక్షులు మాదాసు సంజీవ్, జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్ తో కలిసి కోర్టు చౌరస్తాలో ఉన్న ఆయన విగ్రహానికి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగమును తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని మరియు అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళులు అని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 

రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రథమ లక్ష్యం.. *రోల్ మోడల్ గా కరీంనగర్ నిలుస్తుంది.. *అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక కృషి.. *ప్రతి ఒక్కరు సహకరించాలి.. *జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా