రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రథమ లక్ష్యం.. *రోల్ మోడల్ గా కరీంనగర్ నిలుస్తుంది.. *అరైవ్ అలైవ్ కార్యక్రమం విజయవంతానికి ప్రత్యేక కృషి.. *ప్రతి ఒక్కరు సహకరించాలి.. *జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఏప్రిల్ 10 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే ప్రథమ లక్ష్యంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రత్యేక కృషి చేస్తున్నామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో కరీంనగర్ జిల్లా రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఆర్ అండ్ బి, ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖతో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ర్యాష్ డ్రైవింగ్.. మద్యం తాగి వాహనాలు నడపడం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మానవ తప్పిదాల వల్లే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సిపి పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 13 వ తేదీ నుంచి అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నదని పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడమే లక్ష్యంగా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. రహదారి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ట్రాఫిక్ రూల్స్ పై గ్రామాల్లో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి చైతన్యవంతులను చేస్తామని తెలిపారు. పక్క ప్రణాళికతో మండలాలు గ్రామాల వారికి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అత్యధికంగా మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ట్రాఫిక్ రూల్స్ వాహనదారులు పాటించాలని కోరారు. విధిగా హెల్మెట్ సీటు బెల్టు తోపాటు ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతాల్లో పోలీసు ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు అరైవు అలైవు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కృషి చేయాలన్నారు. గ్రామాలు మండలాల వారిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజలందరికీ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సామాజికంగా బాధ్యత మరింత పెరిగేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామన్నారు.

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ వాహనదారులు ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. వాహనదారులు హెల్మెట్ సీటు బెల్టు ధరించాలని మద్యం తాగి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
మొదటిరోజు (13వతేది సోమవారం) ప్రతి గ్రామంలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు 14వ తేదీన బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహాల వద్ద వాహనదారులు, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా సామూహిక ప్రమాణ స్వీకార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 15వ తేదీన ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, అక్కడ తక్షణమే హెచ్చరిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్స్ రోడ్ మార్కింగ్స్‌ను పునరుద్ధరించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. 16వ తేదీన పాఠశాలల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, చిన్నతనం నుంచే ట్రాఫిక్ క్రమశిక్షణ అలవడేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు . ఆటో, బస్సు, లారీ డ్రైవర్లకు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి, హెల్మెట్.. సీట్‌బెల్ట్ ప్రాముఖ్యతను వివరించాలన్నారు. 17వ తేదీన ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లో బాధితులకు అందించాల్సిన ప్రాథమిక చికిత్స, సహాయంపై ప్రజలకు వివరించాలని తెలిపారు. అదేవిధంగా 17వ తేదీన కరీంనగర్ పోలీస్ పోలీసు పేరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 18వ తేదీన వారంలో ఒక రోజు ట్రాఫిక్ ఉల్లంఘనపై జరిమానాలు విధించకుండా, కేవలం కౌన్సెలింగ్ ద్వారా వాహనదారుల్లో మార్పు తీసుకురావడం జరుగుతుందని సిపి తెలిపారు. రహదారి భద్రత అనేది కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి ప్రధాన బాధ్యత అని సిపి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ వెంకటరమణ, డిఎంహెచ్వో వెంకటరమణ, డిటిఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, ట్రాఫిక్ ఏసిపి యాదగిరి స్వామి, ఆర్టీసీ ఆర్ అండ్ బి విద్యాశాఖ తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత