భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏప్రిల్ 17, 2026…ఒక చీకటి రోజు *ఇది భారతదేశ నారీ శక్తి’కి జరిగిన క్షమించరాని ద్రోహం *బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి

కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ మరియు దాని I.N.D.I కూటమి తమ మహిళా వ్యతిరేక ఆలోచనా ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నాయి. ముప్పై ఏళ్ల పాటు మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నారు. ఆ తర్వాత దీన్నిపరిహాసం చేశారు. ఏకంగా దీన్ని నిలిపివేశారు. ఇది రాజకీయం కాదు.. మహిళలు సాధికారత సాధిస్తారనే భయం! మహిళలు అధికార పీఠాలను అధిరోహిస్తుంటే రాహుల్ గాంధీకి, ఆయన మిత్రపక్షాలకు ఎందుకు అంత భయం? మహిళలను కేవలం ఓటు బ్యాంకులుగా చూడటమే తప్ప, వారిని చట్టసభల ప్రతినిధులుగా చూడటం కాంగ్రెస్‌కి ఇష్టం లేదా? మన తల్లులు, అక్క – చెల్లెళ్లు, ఆడబిడ్డలు, కూతుర్లకు.. సాధికారత కల్పించే ఒక బిల్లు వీగిపోతుంటే, సంబరాలు చేసుకోవడం కంటే సిగ్గుచేటు మరొకటి లేదు. పార్లమెంటు లోపల వారు కొట్టిన చప్పట్లు భారతదేశంలోని ప్రతి మహిళను అవమానించడమే. మహిళలకు అధికారం ఉండకూడదని, వారికి ప్రాతినిధ్యం దక్కకూడదని కాంగ్రెస్ బలంగా కోరుకుంటుంది. మహిళాసాధికారత కాదు వారిని నియంత్రించడమే కాంగ్రెస్ లక్ష్యం అని అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత