కరీంనగర్/రామడుగు, ఏప్రిల్ 15 (జాగో న్యూస్): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వైన్ షాపు సమీపంలో మంగళవారం ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ పట్టణానికి చెందిన కాసిన గొట్టు భారతి,అనే మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రామడుగు ఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో గాయపడిన మహిళను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న ఎస్ఐ రాజు,తన విధి నిర్వహణ లో భాగంగా, మానవత్వం చాటుకున్నారు. స్ట్రెచర్‌పై ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లడం గమనార్హం. ప్రస్తుతం గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధిం చిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.








