సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహించాలి *రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు *హాజరైన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక* కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులాలు, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాలలో మరమ్మతు పనులను చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.

ఆదర్శంగా నిలుద్దాం..*ప్రణాళిక ప్రకారం నిర్వహించాలి*అధికారులు ప్రత్యేక కృషి చేయాలి..*జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహిద్దామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో శనివారం సాయంత్రం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడంపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ్లకు ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని విద్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించాలని స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడదామని పేర్కొన్నారు రైతుల రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ వారాన్ని కరీంనగర్ జిల్లాలో అత్యద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలోని ఆదర్శంగా నిలుద్దామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే డిపిఓ జగదీశ్వర్ పీడీ హౌసింగ్ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తిరుమలరావు బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ డిటిడిఓ సంగీత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

కరీంనగర్ జాగృతిలోకి పలువురు నాయకులు జాగృతిలోకి చేరిక. *తెలంగాణ సమూల అభివృద్ధే జాగృతి లక్ష్యం. *జాగృతి ద్వారా కొత్తతరం రాజకీయాలు చూస్తారు. *రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి నాయకులు కదలిరావాలి. *జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత