కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): పోషణ పక్వాడలో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్, సంతోష్నగర్ సెక్టార్, ముకురాంపుర 3వ, అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే మరియు పిల్లల తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్ ల వాడకం మరియు జంక్ ఫుడ్ వాళ్ళ కలిగే నష్టల గురుంచి అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో సీడీపీఓ సబిత మాట్లాడుతూ ప్రీ స్కూల్ పిల్లల గ్రాడ్యుయేషన్ డే కి హాజరు కా వడం సంతోషo గా ఉంది అని వాళ్ళు నేర్చుకున్న ఆటపాటలు చక్కగా చూపించారు . ప్రతిరోజు అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలు చాలా చురుకుగా ఉంటారు అని అన్నారు. 80 % బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ వయసు లో ఉన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది అని అంగన్వాడీ నిర్వహించే ప్రీ స్కూల్ కార్యక్రమల వాళ్ళ పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్, శరీరక ఎదుగుదలకు ఎంత గానో ఉపయోగం గా ఉంటుంది అన్నారు. ఈ నిత్య జీవితంలో సమయం లేక పిల్లలకి మొబైల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని మొబైల్ ఫోన్లకి బానిసలయ్యేలా తల్లిదండ్రులు చేస్తున్నారు అని అతిగా మొబైల్ వాడకం మరియు రేడియేషన్ ప్రభావం వల్ల పిల్లల మెదడుపై చాలా చెడు ప్రభావం పడుతుంది అని బయట దొరికే జంక్ ఫుడ్ పిల్లలకు పెట్టడం వలన పిల్లలు ఆరోగ్యo మీద చెడు ప్రభావం ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమం లో సీడీపీఓ సబిత, సూపెర్వైసోర్ నిర్మల, బీసీ సతీష్, ప్రతం రాజేందర్, దేవ్ శ్రీలత, అంగన్వాడీ టీచర్,గర్భిణీ లు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.








